‘ఛావా’ సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ రియాక్షన్ ఇదే.. భయంకరంగా చేశారంటూ స్పెషల్ నోట్

by Hamsa |
‘ఛావా’ సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ రియాక్షన్ ఇదే..  భయంకరంగా చేశారంటూ  స్పెషల్ నోట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా శివాజీ మహారాజ్ కొడుకు జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది. అలాగే సినీ ప్రియులనే కాకుండా సినీ సెలబ్రిటీలను సైతం మంత్రముగ్దులను చేస్తోంది. ఇప్పటికీ ఎంతో మంది సినీ స్టార్స్ ‘ఛావా’ మూవీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా, టాలీవుడ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ట్విట్టర్ ద్వారా ‘ఛావా’పై ఓ ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేసింది.

మళ్లీ రావా, దేవదాస్ వంటి సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఆమె బెంచ్ లైఫ్, షష్టిపూర్తి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు సినిమా చూసి ఏడ్చేసింది. ‘‘ఎట్టకేలకు నేను ‘ఛావా’ సినిమాను చూడవలసి వచ్చింది. దీనిని లక్ష్మణ్ అద్భుతంగా తెరకెక్కించారు. నక్షత్ర నిర్మాణం అత్యుత్తమ నటీనటులు ఉన్నారు. విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ అద్భుతమైన, భయంకరమైన నటనతో మెప్పించారు. మరెవరూ చేయలేని విధంగా మీరు పాత్రను పోషించారు. మీరు స్క్రీన్‌పై ఉన్న ప్రతి క్షణం ఆకట్టుకునేలా ఉంది.

పార్వతి పటే హర్ హర్ మహాదేవ్ డైలాగ్-మీరు మెరుగుపరిచారని తెలుసుకోవడం అది మరింత శక్తివంతమైనది. ప్రజలు తరచుగా సూక్ష్మ నటన శక్తిని తక్కువగా అంచనా వేస్తారు. కానీ అది ఎంత సవాలుగా ప్రభావవంతంగా ఉంటుందో మీరు నిరూపించారు. దివ్యా దత్తా(Divya Dutta) మేడమ్ మీ కళ్లలోని లోతు, మీ పనితీరులోని తీవ్రత బాగుంది. మరాఠీ రాణి పాత్రలో మీరు చూపిన అంకితభావం నిజంగా అభినందనీయం రష్మిక. నా ఫేవరేట్ వినీత్‌తో నేను రంగ్ బాజ్ సినిమాలో నటించాను.. అతని సత్తా ఏంటో నాకు తెలుసు.. కవి కలాష్ పాత్రలో చూసి షాక్ అయ్యాను.. అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్.. శుద్ద్ హిందీలో చెప్పిన కవిత్వాలు, పొయెట్రీ అద్భుతంగా అనిపించింది.. నీ పట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను.. నీ సక్సెస్ నా సక్సెస్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను’’ రాసుకొచ్చింది.

Next Story