వస్తావా అని డైరెక్ట్ గానే అడుగుతారు.. క్యాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి సంచలన కామెంట్స్..!

by Kavitha |   ( Updated:2024-09-01 14:15:13.0  )
వస్తావా అని డైరెక్ట్ గానే అడుగుతారు.. క్యాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి సంచలన కామెంట్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే చాలా మంది నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకున్నారు. అయితే ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి హేమ కమిటీ నివేదిక ఇవ్వడంతో అన్ని ఇండస్ట్రీలు అలా చేయాలనే విధంగా చాలామంది సెలబ్రిటీలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలోనే బుల్లితెర నటిగా పలు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి రాగిణి తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గతంలో తెలియజేసింది. ముఖ్యంగా వెండితెరపైనే కాదు బుల్లితెర పైన కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదనే విధంగా ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాగిణి.. తన పర్సనల్ లైఫ్ విషయాలపై ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తెలియజేసింది.. ఆమె మాట్లాడుతూ.. నటిగా రాణించాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే.. సినిమా అవకాశాలు చాలానే వచ్చిన కొన్ని కారణాల చేత సినిమాల్లో ఎక్కువగా నటించలేకపోయినానని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లని బాగున్నావా అని అడిగితే చాలు పైనుంచి కింద వరకు చూసి వస్తావా అని డైరెక్ట్ గానే అడుగుతారని.. అలా నన్ను చాలామంది అడిగారని అప్పుడు నాకు చాలా బాధ కలిగిందని తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకోవడం కోసం చాలానే కష్టపడ్డానని రాగిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed