అక్కడ కలెక్షన్స్ షేక్ అవ్వాలి.. లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది.. నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-01-29 07:33:39.0  )
అక్కడ కలెక్షన్స్ షేక్ అవ్వాలి.. లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది.. నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సమంత(Samantha)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ 4సంవత్సరాలకే వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు(Divorce) తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(shobhitha Dhulipala)తో సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉంటూ డిసెంబర్ 4న మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక అతని సినిమాల విషయానికి వస్తే.. ఎన్నో చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ మంచి హిట్ అయితే పడలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చందు మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్‌లో ‘తండేల్’(Thandel) అనే సినిమా చేస్తున్నాడు. సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. అయితే ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో పాటు వరుస అప్‌డేట్ ఇస్తూ మూవీపై మరింత హైప్ పెంచుతున్నారు.

ఈ క్రమంలో నాగ చైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో చైతన్య మాట్లాడుతూ.. ‘మన పుష్ప కా బాప్ అల్లు అరవింద్(Allu aravind) గారు.. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్‌గా ఉన్నారు. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో మూవీ ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉంది. అల్లు అరవింద్ గైడెన్స్ చాలా విలువైనది. నేను లైఫ్ లాంగ్ ఆయనకు రుణపడి ఉంటా. ఇక వైజాగ్ విషయానికి వస్తే.. ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటా.

ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదే. కాబట్టి మీకో రిక్వెస్ట్.. తండేల్ సినిమాకు వైజా‌గ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటే నా పరువు పోతుంది. ఈ పాలి యాట తప్పేదేలేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed