Tenth Exams: ఏపీలో పది పరీక్షలు ప్రారంభం

by Anil Sikha |
Tenth Exams: ఏపీలో పది పరీక్షలు ప్రారంభం
X

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు (public exams) సోమవారం ప్రారంభం అయ్యాయి.రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరుగుతుంది. చివరి పరీక్షను రంజాన్ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 2024-25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. ఏపీలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. విద్యార్థులు హాల్ టికెట్ (Hall ticket)చూపించి పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. విద్యార్థులు తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది

Next Story

Most Viewed