ఆ పని చేసి అడ్డంగా దొరికిపోయిన యంగ్ హీరో.. అసలు విషయం చెప్పడంతో అంతా షాక్!

by Hamsa |
ఆ పని చేసి అడ్డంగా దొరికిపోయిన యంగ్ హీరో.. అసలు  విషయం చెప్పడంతో అంతా షాక్!
X

దిశ, సినిమా: యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘లవ్ టుడే’(Love Today) చిత్రంతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్‌గా సినిమాలు తెరకెక్కిస్తూనే.. హీరోగా వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు. తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రదీప్, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కయాద్ లోహల్(Kayad Lohal) కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’(Dragon). దీనికి అశ్వత్ మరి మత్తు దర్శకత్వం వహించగా.. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్, గణేష్, సురేష్ నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఈ క్రమంలో.. వరుసగా ప్రదీప్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతోనూ ముచ్చటిస్తున్నారు. తాజాగా, ప్రదీప్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘‘బీటెక్ చదివే రోజుల్లో కెమిస్ట్రీ పరీక్షలో ఆన్సర్‌కు బదులు కథలు రాశాను. ఇక అది టీచర్ గుర్తించి బాగా ట్రై చేశావు. ప్రదీప్ దయచేసి ఇలాంటి కథలు రాయొద్దు అని చెప్పింది. అయితే ఈ పరీక్షలో నాకు 50కి పదకొండున్నర మార్కులు వచ్చాయి. యూనిట్ టెస్ట్‌లో మాత్రమే ఈ మార్కులు వచ్చాయి కానీ మెయిన్ ఎగ్జామ్స్ మాత్రం బాగా చదివి రాశాను. అయితే పరీక్షలో కథలు రాయొద్దని టీచర్ నాకు చెప్పింది. అందుకే నేను కథలు రాసే రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నా’’ అని రాసుకొచ్చారు. అలాగే ఆన్సర్ ఫీట్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు సరిగ్గా చదవకపోయినా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడని తెలుసుకుని షాక్ అవుతుండగా.. మరికొందరు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

Next Story