- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ మూడ్‌లో ఉన్నానంటూ ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. ఆకట్టుకుంటున్న పోస్ట్

దిశ, సినిమా: ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దీంతో ఈ మూవీటీమ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క మీనాక్షి నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్‌లతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ భామ ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో చీర కట్టుకుని ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమిచ్చింది. ఎప్పుడూ బోల్డ్ లుక్‌తో కనిపించే ఈ బ్యూటీ సడెన్‌గా ఇలా చీరలో కనిపించి అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అంతేకాకుండా వాటికి కచ్చితంగా హ్యాపీ మూడ్‌లో ఉన్నాను అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోస్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు బ్యూటీ ఫుల్ మీనూ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.