Vikatakavi : ‘వికటకవి’ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్

by sudharani |   ( Updated:2024-11-14 15:31:36.0  )
Vikatakavi : ‘వికటకవి’ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: నరేష్ అగస్త్య(Naresh Agastya), మేఘా ఆకాష్ (Megha Akash) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వికటకవి’ (Vikatakavi). తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి (Director Pradeep Maddali)దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి (Producer Ram Talluri) నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఈ సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 28 నుంచి ప్రేక్షకుల‌ ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు కూడా విశేష స్పందన లభించింది.

ఇప్పుడు రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ‘వికటకవి’ నుంచి మేఘా ఆకాష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘సైకియాట్రిస్ట్ లక్ష్మిని కలవండి.. ఆమె చాలా దయ కలిగిన వ్యక్తి. కానీ ఆమె దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆమె డిటెక్టివ్ గ్యాంగ్‌లో ఉంది. అమరగిరి ప్రాతం యొక్క చాలా కాలం నుండి కోల్పోయిన రహస్యాలను కనుగొనడంలో ఆమె సహాయం చేస్తుందా?’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌లో మేఘా ఆకాష్.. ఒక లుక్‌లో చాలా స్టైలిష్‌గా అలాగే మరో లుక్‌లో చేతిలో లాంతర్ పట్టుకున్ని ఏదో వెతుకుతున్నట్లు కనిపించింది. ప్రజెంట్ ఈ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తుంది.

Read More ...

Matka Twitter Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?







Advertisement

Next Story