- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భర్తతో ఆ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. సమంత రియాక్షన్ ఇదే..!

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local), ‘నేను శైలజ’(Nenu Sailaja) వంటి సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే మంచి స్టార్ డమ్ అందుకుంది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలకైతే అవార్డ్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) సరసన ‘బేబీ జాన్’(Baby John) సినిమాలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.
ఇక కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్(Antony Thatil)తో ప్రేమలో పడింది. అలా దాదాపు 15ఏళ్లకు పైగా ప్రేమించుకున్న వీరు గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం కీర్తి తన భర్తతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడమే కాకుండా వేకేషన్స్, హనీ మూన్‌కి వెళ్లిన ఫొటోస్ కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అలాగా నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్‌తో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కీర్తి సురేష్ గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ ఫస్ట్ హిందూ సంప్రదాయంలో చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ ఫొటోలు అప్పట్లో షేర్ చేసిన ఈ బ్యూటీ.. మరోసారి కొన్ని హిడెన్ ఫొటోస్‌ని అభిమానులతో పంచుకుంది. వాటిన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. 'ఆపై మేము మా "ఒక సన్‌డౌనర్‌లో ప్రతిజ్ఞ" తీసుకున్నాము’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఈ ఫొటోస్ కోసమే వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ పోస్ట్ పై స్టార్ హీరోయిన్ సమంత స్పందిస్తూ హో వావ్ అంటూ స్టార్ ఎమోజీలను జోడించింది.