𝗦𝗦𝗠𝗕 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 : జనవరిలో మహేశ్ బాబు-రాజమౌళి సినిమా షూటింగ్ షురూ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-09 14:28:08.0  )
𝗦𝗦𝗠𝗕 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 : జనవరిలో మహేశ్ బాబు-రాజమౌళి సినిమా షూటింగ్ షురూ
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో హీరో మహేశ్ బాబు నటించనున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. మహేశ్ బాబు-రాజమౌళి మూవీ జనవరిలో ప్రారంభమవుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ (Writer Vijayendra Prasad)వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. సినిమా కథపై ఆయన తరుచు చిన్న చిన్న లీక్ లు ఇస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంపొందిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని, ఆఫ్రికా అడవుల(African forest) నేపథ్యంలో కథ సాగనుందని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మహేశ్(Mahesh Babu) ఇంటెన్సిటీ ఉన్న నటుడని.. ఇది ఎంతో సాహసోపేతమైన కథ అని విజయేంద్ర ప్రసాద్ గతంలో అన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారన్నదానిపై ఆయన కీలక సమాచారం వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో సినిమా చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

గతంలో ఈ చిత్రం గురించి మహేశ్ బాబు మాట్లాడుతూ రాజమౌళితో కలిసి ఒక చిత్రం చేయాలన్న నా కల నిజం కాబోతుందని చెప్పారు. ఎప్పటి నుంచో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నామని, మేమిద్దరం దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామని, ఇప్పటికి కుదిరిందని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram Srinivas) సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. ఎస్ఎస్ ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రాజమౌళి సినిమా మొదలయ్యే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ మాటల్లో స్పష్టమైంది.

Advertisement

Next Story