వ్యాపారవేత్తను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. పోస్ట్‌తో ట్విస్ట్ ఇచ్చిందిగా!

by Hamsa |
వ్యాపారవేత్తను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. పోస్ట్‌తో ట్విస్ట్ ఇచ్చిందిగా!
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెడుతున్నారు. కొంతమంది అయితే సీక్రెట్‌గా పెళ్లిళ్లు చేసుకుంటూ షాకిస్తున్నారు. కొందరు ప్రేమించుకుని వివాహం చేసుకుంటున్నారు కానీ చివరి వరకు కలిసి ఉండటం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri)సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. గత కొద్ది కాలంగా టోని బేక్(Tony Bake) అనే వ్యాపారవేత్తతో ఆమె డేటింగ్‌లో ఉండగా ఫిబ్రవరిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. లాస్ ఏంజెల్స్‌లోని ఒక స్టార్ హోటల్‌లో నర్గీస్, టోనిల వివాహం గ్రాండ్‌గా జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని వీరిద్దరు రహస్యంగా ఉంచారు.

అయితే పెళ్లి తర్వాత ఈ కొత్త జంట స్విట్జర్లాండ్‌కు హనీమైన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నర్గీస్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. మొత్తానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిందిగా.. అయినా సీక్రెట్‌గా చేసుకోవడానికి కారణాలేంటో అని పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నర్గీస్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఆమె భర్త గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. టొనీ బేక్ కాశ్మీర్ కుటుంబానికి చెందిన ఒక వ్యాపారవేత్త అని బయటపడింది. కానీ వీరి కుటుంబం అమెరికాలో సెటిల్ అయినట్లు సమాచారం.

ఒక నర్గీస్ సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు ‘రాక్‌స్టార్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత డిష్యుం, హౌజ్‌ఫుల్-3, మద్రాస్ కేఫ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా హావీవుడ్‌లోనూ ‘స్పై’ మూవీతో అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఇక తెలుగులో ‘అమావాస్య’ మూవీతో వచ్చింది. ప్రస్తుతం నర్గీస్ ఫక్రీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). జ్యోతి కృష్ణ(Jyothi Krishna), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol)విలన్‌గా కనిపించనున్నాడు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Next Story

Most Viewed