- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మూవీ చూసి క్లూ ఇస్తే రూ.10 వేలు మీకే.. పూరి జగన్నాథ్ తమ్ముడి సినిమాకు బంపర్ ఆఫర్

దిశ, సినిమా: సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath) సోదరుడు సాయిరామ్ శంకర్ (Sairam Shankar)నటిస్తున్న తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’( Oka Pathakam Prakaram). సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వినోద్ విహాన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్స్‌పై గార్లపాటి రమేష్ నిర్మిస్తుండగా వినోద్ కుమార్ విజయన్ (Directer Vinod Kumar Vijayan) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మూవీ టీమ్ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఇంటర్వెల్ వరకు చూసి.. విలన్ ఎవరో చెప్పగిలిగినవారికి 50 థియేటర్ల నుంచి.. థియేటర్‌కి ఒకరు చొప్పున 50 మంది విజేతలకు 10 వేల రూపాయలు బహుమతి అందిస్తాము. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించినప్పటికీ... విలన్ ఎవరో.. హీరో ఎవరో కనిపెట్టలేరని మేము భావిస్తున్నాము. అందుకే 50 మంది విజేతలకు 10 వేల రూపాయల చొప్పున 5 లక్షలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది నా కెరీర్‌కి ఎంతో హెల్పయ్యే సినిమా. నాకు కచ్చితంగా కమ్ బ్యాక్ ఫిల్మ్ ఆవుతుంది. ఇందులో నేను సిద్ధార్థ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్(Public Prosecutor)గా నటించాను. ఈ చిత్రం ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. ఇది నా హామీ. ఇటువంటి సినిమ కోసమే ఇన్నాళ్లుగా వెయిట్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సినిమాలో శృతి సోధి(Shruti Sodhi), ఆషిమా నర్వాల్(Ashima Narwhal), సముద్రఖని(Samudrakhani), రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.