Pragya Nagra:ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి

by Jakkula Mamatha |   ( Updated:2024-12-08 14:20:41.0  )
Pragya Nagra:ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ నటి ప్రైవేట్ వీడియో లీకైనట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో(Private video) లీకైనట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. తాజాగా ఈ ఘటనపై నటి ప్రగ్యా నగ్రా స్పందిచారు. ఈ ఘటన పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరిట ప్రచారంలో ఉన్న వీడియో తనది కాదని నటి ప్రగ్యా నగ్రా(Actress Pragya Nagra) ట్విట్టర్ వేదికగా తెలిపారు.

‘మళ్లీ చెబుతున్నా. ఆ వీడియో నాది కాదు. ఇదో పీడకల అయితే బాగుండేది. టెక్నాలజీ మన జీవితాలకు ఉపయోగపడాలి తప్ప దుర్భరం చేయకూడదు. ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారిపై జాలేస్తోంది. నాకు అండగా నిలిచిన వారందరికీ థాంక్స్. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికి రాకూడదు’ అని ట్వీట్ చేసిన ఆమె దానిని సైబర్ క్రైమ్ పోలీసుల(Cyber ​​Crime Police)ను ట్యాగ్ చేశారు. ఇలా డీప్‌ఫేక్ వీడియోలను క్రియెట్ చేసి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. హరియాణాకు చెందిన నటి ప్రగ్యా నగ్రా తమిళ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఆమె వీడియోలను ఆన్ లైన్ లో దుండగులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ పని చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.


Click Here For Tweet..

Advertisement

Next Story