Renu Desai: సినిమా చూశాక కన్నీళ్లు వచ్చాయి: రేణూ దేశాయ్

by Hamsa |   ( Updated:2025-01-07 10:34:42.0  )
Renu Desai: సినిమా చూశాక కన్నీళ్లు వచ్చాయి: రేణూ దేశాయ్
X

దిశ, సినిమా: అరవింద్ కృష్ణ(Arvind Krishna), బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ నటించిన తాజా చిత్రం ‘1000 వర్డ్స్’. విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాకు రమణ విల్లర్ట్(Ramana Willert) నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్‌గా పని చేశారు. శివ కృష్ణ(Shiva Krishna) సంగీతం అందించారు. అయితే సోమవారం నాడు స్పెషల్‌గా ఈ మూవీని ప్రదర్శరించారు. ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్‌కు రేణూ దేశాయ్(Renu Desai), ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్(Jyoti Purvaj), సుకు పూర్వాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

స్పెషల్ షోను వీక్షించిన అనంతరం.. రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమాను తీసిన టీంకు ఆల్ ది బెస్ట్. రమణ గారికి ఇది ఆరంభం మాత్రమే. ఆయన్నుంచి ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు రావాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Advertisement

Next Story