- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Devi Sri Prasad: రిలీజ్ కు ముందే తండేల్ సక్సెస్ పార్టీ.. సాయి పల్లవి డ్యాన్స్ మ్యాచ్ చేస్తూ స్టెప్పులేసిన దేవిశ్రీ ప్రసాద్ ( వీడియో )

దిశ, వెబ్ డెస్క్ : నాగచైతన్య (Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi) కలిసి జంటగా నటించిన " తండేల్ " (Thandel) చిత్రం ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందించిన విషయం తెలిసిందే. వాస్తవానికి దేవిశ్రీ ను ముందుగా వద్దనుకున్నారట .. కానీ, అల్లు అర్జున్ లవ్ స్టోరీకి దేవిశ్రీ నే కరెక్ట్ అంటూ అల్లు అరవింద్ కి సలహా ఇచ్చాడట. ఇంక నిర్మాతలు వెంటనే అతన్ని ఓకే చేశారు. రిలీజ్ కు ముందే సినిమాలోని " బుజ్జి తల్లి " పాట 100 మిలియన్ వ్యూస్ కొట్టింది.
ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పాటలన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల హైలెస్సా హైలెస్సా పాట రిలీజ్ కాగా.. ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ లోని స్టెప్పులు ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఓపెన్ ఇవే కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు చందు మెండేటి, దేవీశ్రీ కలిసి ఈ సాంగ్ కి స్టెప్పులు వేశారు. గీతా ఆర్ట్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. " వస్తున్నాం.. దుల్లగొడుతున్నామని " అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో, " దేవీశ్రీ, డైరెక్టర్ చందు మొండేటి ఇద్దరూ కలిసి డ్యాన్స్ భలే వేస్తున్నారుగా.. హీరో ట్రై చేయండి సక్సెస్ అవుతారు " అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేవీశ్రీ అద్భుతంగా పాటలు పాడటమే కాకుండా.. డ్యాన్స్ వేసే టాలెంట్ కూడా తనలో ఉందని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు తండేల్ విడుదలకు ముందే సక్సెస్ పార్టీ ఇలా కూడా ఎంజాయ్ చేయోచ్చని భలే చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ అవుతున్నాయి.