- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Udhayanidhi Stalin: బాలీవుడ్‌లో ఆ సినిమాలను తొక్కేస్తున్నారు.. డిప్యూటీ సీఎం స్టాలిన్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్(Bollywood) చిత్ర పరిశ్రమపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) తీవ్ర విమర్శలు చేశారు. మనోరమ డెయిలీ గ్రూప్(Manorama Daily Group) నిర్వహించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు(South Film Industries) ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. బాలీవుడ్(Bollywood)లో కేవలం హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరాఠీ, బోజ్‌పురి, బిహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
ఉత్తరాధిలో కొన్ని రాష్ట్రాలకు సొంత పరిశ్రమలే లేవు అని అన్నారు. ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో విఫలమైతే ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హిందీ భాష(Hindi Language)కు తమిళనాడు(Tamil Nadu) వ్యతిరేకం కాదని.. దాన్ని తమపై బలవంతంగా రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. భాషను రుద్దడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినయే ద్రవిడ ఉద్యమాలని చెప్పారు. ఇప్పటికీ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.