Varun Tej,Lavanya Tripati మధ్య చిచ్చు పెట్టిన యాంకర్?

by Nagaya |   ( Updated:2023-08-22 14:54:40.0  )
Varun Tej,Lavanya Tripati మధ్య చిచ్చు పెట్టిన యాంకర్?
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవధారి అర్జున’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది మూవీ యూనిట్. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే త్వరలో భార్యాభర్తలు కాబోయే వరుణ్, లావణ్య దంపతుల మధ్య యాంకర్ సుమ చిచ్చు పెట్టింది. విషయం ఏంటంటే ఈ ప్రీరిలీజ్ వేడుకలో ‘కాల్ మీ అర్జెంట్ అంటూ నిహారిక, లావణ్య నుంచి ఒకేసారి మెసేజ్ వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు?’ అని వరుణ్‌ను ప్రశ్నించింది. దీంతో వరుణ్ ఒక్కసారిగా తల పట్టుకుని ‘నిహారిక చిన్నమ్మాయి కాబట్టి తనకే కాల్ చేస్తా’ అని సమాధానం ఇచ్చాడు. ప్రజెంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

కాబోయే భార్య పేరును Varun Tejమొబైల్‌లో ఎలా సేవ్ చేసుకున్నాడో తెలుసా?

టాప్ తీసేసి.. ఎద అందాలు క్లియర్‌గా బయటపెట్టిన Manchu Lakshmi Prasanna

Advertisement

Next Story