డైలమాలో సుకుమార్.. దాని గురించేనా..??

by Disha News Desk |
డైలమాలో సుకుమార్.. దాని గురించేనా..??
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్ అందుకున్నాడు. సుక్కు సినిమా అంటే వేరే లెవెల్ అనేలా 'పుష్ప'ను తెరకెక్కించాడు. 'పుష్ప: ది రైజింగ్'కు వచ్చిన క్రేజ్‌తో 'పుష్ప-2'పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. పాన్ ఇండియా డైరెక్టర్ సుక్కు 'పుష్ప-2' విషయంలో డైలమాలో పడిపోయాడట.

ఈ మూవీలో ఏ పాత్రను ఎలా చూపించాలి. హీరో ఎలివేషన్స్‌ను నెవ్వర్ బిఫోర్ అనేలా ఎలా ప్లాన్ చేయాలని జుట్టు పీక్కుంటున్నాడట. వీటన్నింటికీ మించి ఈ మూవీ క్లైమాక్స్ సుక్కుకు పెద్ద తలనొప్పిగా మారిందట. 'పుష్ప-2' క్లైమాక్స్‌ను నెవ్వర్ బిఫోర్ అనేలా, దేశవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ అందరినీ మెప్పించేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి 'పుష్ప2' క్లైమాక్స్‌ను ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.

Advertisement

Next Story