ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్స్‌ను ఏడుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-08-24 17:16:03.0  )
ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్స్‌ను ఏడుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నందమూరీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్జీఆర్ స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఎన్జీఆర్‌తో నటించాలని ఇప్పటికీ సీనియర్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపుతుంటారు. అయితే అలాంటి ఛాన్స్ వస్తే ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా ఏడుసార్లు క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క.

ఎన్టీఆర్‌, అనుష్క కాంబోలో దాదాపు ఏడు సినిమాలు రావాల్సి ఉండగా అన్ని క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉండేవాడు. ఆ తర్వాత ఏదో సర్జరీ చేయించుకుని సన్నగా మారినట్లు అప్పట్లో వార్తలు కూడా ఊపందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బొద్దుగా ఉండటం వల్ల చాలా మంది హీరోయిన్స్ ఆయన పక్కన నటించడానికి ఆలోచించే వారట. అందులో ముఖ్యంగా అనుష్క ఆమె వద్దకు వచ్చి డైరెక్టర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నాడని అనగానే నో అని రిజెక్ట్ చేసేదట. అలా ఆమె ఏడు సినిమాలను మిస్ చేసుకున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి :

ఇండస్ట్రీలోకి తారక్ తనయుడి ఎంట్రీ?.. ఏకంగా తండ్రి సినిమాతోనే

పెళ్లికి ముందే ఆ విషయంలో మెగా కుటుంబానికి కండిషన్ పెట్టిన లావణ్య.?

Advertisement

Next Story