సన్యాసిగా మారబోతున్న స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే?

by Hamsa |
సన్యాసిగా మారబోతున్న స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇటీవల ‘డాకు మహారాజ్’(Daaku Maharaj) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘అఖండ-2’(Akhanda-2) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కూతురు తేజస్విని నందమూరి ప్రజెంట్స్ బ్యానర్‌పై తేజస్విని(Tejaswini) నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కావడంతో పాటు రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలైపోయింది.

అంతేకాకుండా పలు పోస్టర్లు కూడా విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కుంబమేళాలో జరుగుతోంది. అయితే కోట్ల మంది భక్తులు, నాగ సాధువులు, అఘోర పాత్రలతో కూడిన సీన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అఖండ-2లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన(Shobhana) సన్యాసి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆమె పాత్రలోని వేరియేషన్స్ ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కాగా శోభన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ లో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు బాలయ్యతో నటించనుంది.



Next Story

Most Viewed