డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయడం కంటే ఖాళీగా కూర్చోవడం బెటర్.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2023-11-10 07:38:19.0  )
డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయడం కంటే ఖాళీగా కూర్చోవడం బెటర్.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం చరణ్ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి బుచ్చిబాబుతో చేస్తుండగా.. తమిళ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. దీంతో గేమ్ ఛేంజర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శంకర్ భారతీయుడు-2 అనే సినిమాను ప్రకటించాడు. అయితే ఈ రెండు చిత్రాలు ఇప్పటి వరకూ షూటింగ్ పూర్తి కాలేదు.

ఇక గేమ్ ఛేంజర్ స్టార్ట్ అయి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆ సినిమా షూట్ ఇంకా పూర్తి కాకపోవడంతో రామ్ చరణ్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్‌తో విసిగిపోయిన రామ్ చరణ్ శంకర్‌తో సినిమా చేయడం కంటే ఓ రెండు సంవత్సరాలు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ జోక్‌గా సన్నిహితుల దగ్గర అన్నట్లు తెలుస్తోంది. అయితే చరణ్ ఫన్నీగా అన్నప్పటికీ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గేమ్ చెంజర్ సినిమాకు సంబంధించిన షూట్ ఇంకా 50% వరకు బ్యాలెన్స్ గా ఉండడంతో ఆ సినిమా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబు సినిమా తెరకెక్కించాలని రామ్ చరణ్ చూస్తున్నాడు.

Advertisement

Next Story