- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడి షాకిచ్చిన సింగర్.. వైరల్ మారిన పోస్ట్

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీలంతా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్తేస్తున్నారు. ఇటీవల నాగచైతన్య(Naga Chaitanya), కీర్తి సురేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, సింగర్ దర్శన్ రావల్(Darshan Raval) తన చిన్ననాటి స్నేహితురాలు ధరల్ సురేలియా(Dharal Surelia)ను పెళ్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్ పెళ్లి ఫొటోలు షేర్ చేయడంతో ప్రైవేట్‌గానే ఉండనివ్వండి మీ బంధం బలపడేవరకు అని కామెంట్లు పెడుతున్నారు. ఇక సినీ సెలబ్రిటీల శుభాకాంక్షలు చెబుతున్నారు.
టాలీవుడ్ స్టార్ట్ హీరోయిన్ సమంత కూడా కంగ్రాట్స్ చెప్పడం విశేషం. కాగా.. దర్శన్ 2014లో ఇండియాస్ రా స్టార్ మొదటి సీజన్‌లో పాల్గొన్న ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ విన్నర్ కాలేకపోయారు. ఆ తర్వాత పలు హిందీ, తమిళ గుజరాతీ చిత్రాలకు దర్శన్ అందించిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక తెలుగులో నాని ‘జెర్సీ’(Jersey) సినిమాలో నీదా పదధాని అనే పాట పాడి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.