మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులపై షకీలా సంచలన కామెంట్స్.. కమిట్మెంట్ అడిగేవారు అడుగడుగునా ఉంటారంటూ

by Kavitha |   ( Updated:2024-08-29 14:13:47.0  )
మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులపై షకీలా సంచలన కామెంట్స్.. కమిట్మెంట్ అడిగేవారు అడుగడుగునా ఉంటారంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు సౌత్‌లో సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకున్న నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి స్టార్ హీరోలకు ధీటుగా తన సినిమాలతో అలరించేది షకీలా. అలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అంటూ అన్ని భాషల్లో నటించి బంపర్ విక్టరీ కొట్టింది. కానీ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. రీసెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి.. అభిమానులకు మరింత దగ్గరైంది. కానీ, కొన్ని వారాలకే బయటకు వచ్చేసింది.

ఇదిలా ఉంటే.. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు, దాడి ఘటనలపై రిటైర్డ్ మహిళా న్యాయమూర్తి హేమ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక చూసి దేశం మొత్తం షాక్ అయ్యింది. ఇప్పటికే దీనిపై చాలా మంది స్పందించారు. అందులో భాగంగా తాజాగా నటి షకీలా కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆమె మాట్లాడుతూ.. ''మలయాళ చిత్ర పరిశ్రమలో లాగానే తమిళ చిత్రసీమలో కూడా మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అలాగే తెలుగు ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. హిందీ విషయానికొస్తే అక్కడికి వెళ్లిన వెంటనే అందరూ స్నేహితులవుతారు. కాబట్టి వారికి దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే బాలీవుడ్‌లో వారసత్వ సమస్య ఉంటుంది అని షకీలా వెల్లడించారు. అలాగే ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు చాలానే జరుగుతున్నాయి. కొంతమంది దీని పై మాట్లాడుతున్నారు. మరికొంత మంది బయటపడటం లేదు. కమిట్మెంట్ అడిగేవారు మనకు అడుగడుగునా కనిపిస్తారు. నేను ఇది చేయలేను అని మీరు గట్టిగా చెప్పినప్పుడు సమస్య రాదు. కాబట్టి ఈ విషయంలో పురుషులకు సరైన హెచ్చరిక ఇవ్వాలి. కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ నటి షకీలా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story