- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభాస్ హీరోయిన్‌కు స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ పంపిన సమంత.. ఆమె రియాక్షన్ ఇదే..(పోస్ట్)

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయి. ఇక పర్సనల్ విషయానికి వస్తే.. 41 వయసులోనూ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటుంది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి(Vijay Dalapathi)తో ప్రేమలో ఉన్నట్లు కొన్ని పుకార్లు నెట్టింట షికార్లు చేస్తుంది. అంతేకాకుండా వీరిద్దరూ చాలా చోట్ల కలిసి కనిపించడం, అలాగే ఇప్పటి వరకు ఏ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయని ఈ భామ విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. మరి వారి రిలేషన్ షిప్ గురించి ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే.. ఓ పక్కా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.
అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో స్టార్ హీరోయిన్ సమంత(Samantha) త్రిషకు సీక్రెట్ ఆల్‌కెమిస్ట్(Secret Alchemist) నుంచి స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్‌ను పంపించింది. ఇక ఇది రిసీవ్ చేసుకున్న త్రిష.. సామ్‌కు థ్యాంక్స్ చెబుతూ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.