ఇట్ బిగిన్స్.. అంటూ సామ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కొత్త లైఫ్ గురించేనా..?

by Kavitha |
ఇట్ బిగిన్స్.. అంటూ సామ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కొత్త లైఫ్ గురించేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత సామ్ మయోసైటీస్ (Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్’(Citadel) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్లలో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా సమంత ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అలాగే ఆ పిక్స్ కింద అండ్ ఇట్ బిగిన్స్.. లెట్స్ గో(And it begins Let’s go) అనే క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు కొత్త జీవితం స్టార్ట్ చేశావా సామ్.. ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ పోస్ట్‌ను ఓ సారి చూసేయండి. కాగా ఈ క్యాప్షన్ తను నటించిన సిటాడెల్- హనీ బన్నీ(Citadel- Honey Bunny) సిరీస్‌కు సంబంధించి పెట్టినట్టు తెలుస్తోంది.

(video link credits to samantha instagram id)

Advertisement

Next Story

Most Viewed