- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
చెల్లి పెళ్లిలో దుమ్ము రేపిన సాయి పల్లవి.. కిర్రాక్ డ్యాన్స్‌తో ఫిదా అనిపించిందిగా (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ప్రేమమ్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా సినిమాల్లో హద్దులు మీరి నటించికుండా మినిమల్ మేకప్‌తో నేచురల్ లుక్స్‌తో ఇంకా ఫేమ్ తెచ్చుకుంది. అలాగే ఈమె నటనకే కాకుండా డాన్స్‌కు కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘తండేల్’ మూవీతో పాటు ‘రామాయణం’ అనే మూవీలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే సాయిపల్లవికి పూజ అనే చెల్లెలు ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్‌గానే ఆమెకు వినీత్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అవ్వగా.. తాజాగా(గురువారం) వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కేరళలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఈ పెళ్లి జరిగిందని సమాచారం. అయితే పెళ్లికి ముందు హల్దీ, మెహందీ ఫంక్షన్, సంగీత్ వేడుకల్లో సాయి పల్లవి, పూజా ఇద్దరూ హల్‌చల్ చేశారు. ఆటలు పాటలతో వివాహ ప్రాంగణంలో హోరెత్తించారు. అక్క చెల్లెలు ఇద్దరూ మంచి డ్యాన్సర్లు కావడం వల్ల వీరు సంగీత్ వేడుకలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
పెళ్లి వేడుకల్లో వీరిద్దరిదే హవా నడిచింది. హిందీ, మలయాళీ, తెలుగు పాటలకు అక్కాచెల్లెళ్లు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. చెల్లి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాయి పల్లవి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి మీరు ఈ అమ్మడు చేసిన డాన్స్ వీడియోలు చూసేయండి