RRR సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్.. పక్కా ప్లాన్‌లో జక్కన్న..??

by Disha News Desk |
RRR సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్.. పక్కా ప్లాన్‌లో జక్కన్న..??
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని సినీ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న సినిమా RRR. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జనవరి 7న రిలీజ్‌కు రెడీ అయింది. ఇందులో భాగంగా మూవీ టీం భారీ ప్రమోషన్స్ చేసింది. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా మూవీ మళ్లీ వాయిదా పడింది. అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్' మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో టీం మళ్లీ ప్రమోషన్స్ చేస్తుందా అన్న ప్రశ్నలు వినిపించాయి.

అదే తరహాలో ఈసారి జక్కన్న ప్రమోషన్స్‌పై అంత దృష్టి పెట్టడని, సినిమాలో సీన్స్‌ను సరిగ్గా చూసుకుంటాడంటూ వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ మూవీ నుంచి అద్దిరిపోయే అప్‌డేట్ వచ్చింది. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం జక్కన్న పక్కా ప్లాన్ వేశాడట. మరోసారి టీవీ షోస్‌, ఇంటర్వ్యూలతో దుమ్ముదులిపేసేందుకు రెడీ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ప్రమోషన్స్ మార్చి 1 నుంచే ప్రారంభించేందుకు రెడీ అయిపోయారని కూడా టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే మార్చి 1 వరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story