Rishabh Shetty: ఛత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి.. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఫస్ట్ లుక్

by sudharani |
Rishabh Shetty: ఛత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి.. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty) ‘కాంతార’ (Kantara) చిత్రంతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రజెంట్ ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కతోన్న ‘కాంతార-2’ (Kantara-2) త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే తెలుగులో జై హనుమాన్ (Jai Hanuman) సినిమాల్లో హనుమాన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇక ఇవే కాకుండా.. ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) జీవితం ఆధారంగా రాబోతున్న మరో చిత్రంలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు.

‘ది ప్రైడ్ ఆఫ్ భాతర్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సందీప్ సింగ్ (Sandeep Singh) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ డైరెక్టర్ మూవీకి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో వర్క్ చేయనున్న టీమ్‌ను ప్రకటించారు. అలాగే.. ఈ చిత్రంలోని రిషబ్ శెట్టి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఈ ఏడాది మే నెలలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival)లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తు్న్న ఈ సినిమా కేవలం సినిమా కాదు.. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఓ యోధుడి కథ అని డైరెక్టర్ సందీప్ సింగ్ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

Next Story