Rashmika Mandanna: భాగస్వామి గురించి రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. ముఖ్యంగా!

by Anjali |
Rashmika Mandanna: భాగస్వామి గురించి రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. ముఖ్యంగా!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న నటీమణుల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒకరు. ఈ అమ్మడు చలో(Chalo), గీత గోవిందం(Geetha Govindam), డియర్ కామ్రేడ్(Dear Comrade), యానిమల్(Animal), రంజితమే(Ranjitame), సరిలేరు నీకెవ్వరు(Sarileru Neekevvaru) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చోటు దక్కించుకుంది. అంతేకాకుండా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు పుష్ప(Pushpa) రెండు భాగాలతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నేషనల్ క్రష్‌కు భాగస్వామి గురించి ప్రశ్న ఎదురవ్వగా.. ఇంట్రెస్టింగ్‌గా బదులిచ్చింది. భాగస్వామి అంటే మన జీవితంలో వచ్చే కష్ట, సుఖాల్లోనూ.. అన్ని దశల్లో తోడుండాలని వెల్లడించింది. ముఖ్యంగా ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలని.. బాధ్యత ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా అతడిది మంచి మనసై ఉండాలని, కష్టాల్లోనూ సపోర్ట్‌గా ఉండాలని తెలిపింది. తన దృష్టిలో లవ్‌లో ఉండటమంటే.. భాగస్వామిని కలిగి ఉండటమేనని రష్మిక చక్కగా వివరించింది. ఎవరికైనా తప్పకుండా ఒక తోడు ఉండాలని.. లేకపోతే జీవితానికే ప్రయోజనముండదని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story