ఆ విషయంలో అతడో మృగం.. చరణ్‌పై బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

by Disha News Desk |
Ram Charan
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అంటే ప్రస్తుతం కేవలం తెలుగు భాషకు సంబంధించిందే కాదు. పాన్ ఇండియా సినిమాల గనిగా మారిపోయింది. వరుస పాన్ ఇండియా సినిమాలతో దేశ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌కు మరింత దగ్గరవుతోంది. అదే తరహాలో బాలీవుడ్ స్టార్స్ కూడా టాలీవుడ్ హీరోలను ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా రణ్‌వీర్ సింగ్ కూడా అదే విధంగా కామెంట్స్ చేశారు. ఇటీవల రణ్‌వీర్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గురించి చెప్పమని అడిగాడు.

దాంతో చరణ్ ఓ మృగం అంటూ రణ్‌వీర్ అన్నాడు. 'చరణ్ ఒక మృగం. సినిమా కోసం చాలా కష్టపడతాడు. పని భూతం. 'మగధీర' సినిమాతో నేను చెర్రీ ఫ్యాన్ అయ్యాను. ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ స్టార్ట్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను' అంటూ రణ్‌వీర్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం రణ్‌వీర్ కామెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story