అక్కడికి వెళ్ళిన రణ్‌బీర్.. గర్ల్‌ఫ్రెండ్‌‌తో కాకుండా బాయ్‌ఫ్రెండ్‌తో

by Disha News Desk |   ( Updated:2022-02-22 06:25:52.0  )
అక్కడికి వెళ్ళిన రణ్‌బీర్.. గర్ల్‌ఫ్రెండ్‌‌తో కాకుండా బాయ్‌ఫ్రెండ్‌తో
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ తాజాగా ఆగ్రాలోని తాజ్ మహల్‌ను దర్శించాడు. అయితే, గర్ల్ ఫ్రెండ్ ఆలియాతో కాకుండా బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో ఈ టూర్ ప్లాన్ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అర్జున్.. ప్రేమకు చిహ్నమైన తాజ్‌ను తనతో కలిసి చూసినందుకు రణ్‌బీర్‌ను టీజ్ చేస్తూ ఆలియాను కూడా ట్యాగ్ చేశాడు. ఈ పోస్టుకు 'తాజ్ + నా నుంచి ప్రేరణ పొంది రణ్‌బీర్‌లోని కళాకారుడు బయటికొచ్చినపుడు' అనే క్యాప్షన్‌ జోడించిన అర్జున్.. తాను కెమెరాకు దూరంగా నవ్వుతుండగా తీసిన ఫొటోను పోస్టు చేశాడు. ఈ పోస్టుపై 'హా.. హా.. చివరకు మీరిద్దరు కలిసి తాజ్‌ను చూశారా' అని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేయగా.. 'అవును ఆలియాతో వెళ్లకుండా నాతో కలిసి మొదటిసారి చూశాడు' అంటూ రిప్లై ఇచ్చాడు అర్జున్. కాగా రణ్‌బీర్, ఆలియా 2017 నుంచి రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/CaPXiPIormP/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story