RAMAYANA: ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. మార్చి నుంచి రంగంలోకి దిగనున్న రాకింగ్ స్టార్..

by Kavitha |
RAMAYANA: ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. మార్చి నుంచి రంగంలోకి దిగనున్న రాకింగ్ స్టార్..
X

దిశ, సినిమా: కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లి తెర హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత కాలంలో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన రాకింగ్ స్టార్ యష్(Rocking Star Yash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్ సినిమాలతో సౌత్ ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి నేడు టాప్ హీరోగా రాణించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ‘కేజీఎఫ్ 1,2’(KGF) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తున్న రాధిక పండిట్‌(Radhika Pandit)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’(Toxic) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కాకుండా యష్ నటిస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ‘రామాయణం’ (Ramayanam). బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి(Nithish Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా(Namit Malhothra)తో కలిసి రాకింగ్ స్టార్ అత్యంత భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్(Ranbeer Kapoor), సీతగా సాయిపల్లవి(Sai pallavi), రావణుడిగా యష్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఫొటోస్‌లో సీతా రాములుగా రణబీర్, సాయిపల్లవి చూడడానికి ఎంతో అందంగా కనిపించారు. అయితే ఇప్పటివరకు హీరోగా చేసిన యష్ ఫస్ట్ టైం రావణుడిగా విలన్ క్యారెక్టర్‌లో కనిపించనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని దాటాయి. ఇక ఎప్పుడెప్పుడు యష్ సెట్‌లోకి అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం యష్ మార్చి నుంచి రంగంలోకి దిగనున్నారని సమాచారం. లంక నేపథ్యంలో వచ్చే సోలో సన్నివేశాలతో ఆ షెడ్యూల్ మొదలవుతుందని తెలిస్తోంది. అయితే దీనికోసం మూవీ టీమ్ కొన్ని ప్రత్యేక సెట్లను సిద్ధం చేయిస్తోందట. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది(2026) దీపావళికి రిలీజ్ కానుంది. ఇక సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed