Upasana: వీటిని దత్తత తీసుకోవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించిన ఉపాసన.. ఫోన్ నెంబర్‌తో సహా డీటెయిల్స్

by Anjali |   ( Updated:2025-02-14 03:40:53.0  )
Upasana: వీటిని దత్తత తీసుకోవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించిన ఉపాసన.. ఫోన్ నెంబర్‌తో సహా డీటెయిల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు ఉపాసన (Upasana)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె ప్రస్తుతం అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్‌(Vice Chairman of Apollo Hospitals)గా ఉంటూ.. ఇటు మెగా కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తుంది. మరోపక్క ఉపాసన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తనవంతు సాయం చేస్తూ మెగా కోడలు గొప్ప మనసు చాటుకుంటుంది. ఇప్పటికే ఉపాసన ఎంతో మందికి సేవలు అందించిన విషయం తెలిసిందే.

ఇక ఉపాసన అండ్ టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) ప్రేమించుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరు ఇరు కుటుంబీకుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ఏడడుగుల, మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లల ప్లాన్ చేసుకున్నారు.

దాదాపు వీరికి పదకొండేళ్ల తర్వాత ఓ పండండి పాప జన్మించింది. ఈ మెగా ప్రిన్సెస్‌కు క్లింకార(Clinkara) అని నామకరణం చేశారు. తరచూ ఉపాసన ఫ్యామిలీకి సంబంధించినవి, వెకేషన్స్ పలు ఫొటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. అందులో క్లింకార కూడా ఉన్నప్పటికీ.. ఫేస్‌ను మాత్రం ఎమోజీలతో కవర్ చేస్తూ ఫొటోలు షేర్ చేస్తారు.

దీంతో మెగా ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. మెగా బుజ్జాయి ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారని.. ఆత్రుతగా కామెంట్లు పెడుతుంటారు. రీసెంట్‌గా ఈ ప్రశ్న నాన్న రామ్ చరణ్‌కు ఎదురవ్వగా.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. క్లింకార తనను నాన్న అని ఎప్పుడూ పిలుస్తుందో అప్పుడే ఆమె ఫేస్ తో సహా ఫొటోలు షేర్ చేస్తానని చరణ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇకపోతే తాజాగా మెగా కోడలు ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నెటిజన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘‘ఆరు పూజ్యమైన దేశీ కుక్క పిల్లలు దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రేమ గల ఇల్లు కోసం వెతుకున్నాయి. దయచేసి + 9912497599 ను సంప్రదించండి’’. అని చివరకు విజయ(Vijaya) గారు అని పేరు కూడా జోడించారు. ఇందులో ఉపాసన ఆరు కుక్క పిల్లల ఫొటోలు కూడా పంచుకుంది.

Next Story

Most Viewed