ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేయబోతున్న రామ్ చరణ్.. కెరీర్‌పై ప్రభావం పడనుందా?మెగా ఫ్యాన్స్ ఫైర్

by Disha Web Desk 6 |
ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేయబోతున్న రామ్ చరణ్.. కెరీర్‌పై ప్రభావం పడనుందా?మెగా ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన మొదట నటించిన చిరుత అంతంత మాత్రం అనిపించింది. ఇక ఆ తర్వాత నటించినవి ఎక్కువగా బ్లాక్ బస్టర్‌ హిట్ నిలిచాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు వేరే వేరే క్యాటగిరీస్‌లో ఏకంగా ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. తండ్రిని మించిన తనయుడిగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఒక్క సినిమాతోనే చరణ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

ప్రస్తుతం చరణ్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. తొందరలో రామ్ చరణ్, శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ విడుదల కాబోతుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఓ రిస్క్ చేయబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనను ఓ స్టార్ హీరో తన సినిమాలో గెస్ట్ రోల్ చేయమని అడిగాడట. అతనికి చరణ్‌కు మధ్య మంచి స్నేహం ఉండటంతో చేసేందుకు ఒప్పుకున్నాడని టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నాక గెస్ట్ రోల్‌లో నటిస్తే.. కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే చరణ్ నిజంగానే ఆ మూవీలో నటిస్తే.. రిస్క్ తీసుకున్నట్లే అని నెట్టింట చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed