దిల్‌రాజుతో రామ్ చరణ్ మరో సినిమా.. అసలు విషయం తెలిస్తే అంతా షాకవ్వాల్సిందే!

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-21 16:08:21.0  )
దిల్‌రాజుతో రామ్ చరణ్ మరో సినిమా.. అసలు విషయం తెలిస్తే అంతా షాకవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) - టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) కాంబినేషన్‌లో సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie) మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నది. ఒకవర్గం అదే పనిగా తొలిరోజు నుంచే తమ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేసిందని చిత్రబృందం ఇప్పటికే ఆరోపణలు చేసింది. దీంతో ఆ నెగిటివ్ ప్రచారం కలెక్షన్లపై పడింది. ఇది అదే సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ప్లస్ అయింది.

ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌తో స్వల్ప నష్టాల పాలైన దిల్‌రాజుకు రామ్ చరణ్ మరో సినిమా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ న్యూస్ ఫేక్ అంటూ మరో వార్త వైరల్ అవుతోంది. ’దిల్ రాజుకు రామ్ చరణ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని.. ప్రస్తుతం బుచ్చిబాబుతో చేస్తున్న RC16, ఆ తర్వాత సుకుమార్‌తో ఒప్పుకున్న RC17లు పూర్తయ్యాకే తర్వాత సంగతి’ న్యూస్ ట్రెండ్ అవుతోంది.

కాగా, గేమ్ ఛేంజర్ సినిమాకు తొలిరోజు రూ.186 కోట్లు వచ్చాయని అధికారికంగా వెల్లడించిన చిత్రబృందం ఆ తర్వాతి రోజు నుంచి ఎన్ని వచ్చాయనేది తెలియజేయలేదు. సోషల్ మీడియా వివరాల ప్రకారం దాదాపు రూ.400 కోట్లకుపైగా సాధించిందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించింది. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించాడు. శ్రీకాంత్(Srikanth), అంజలి(Anjali) కీలక పాత్రల్లో మెరిశారు.

Next Story