Pushpa-2 Movie:బన్నీ ఫ్యాన్స్‌కు ఎగిరి గంతేసే శుభవార్త.. భారీగా తగ్గిన పుష్ప-2 టికెట్ ధరలు

by Jakkula Mamatha |   ( Updated:2024-12-08 11:48:27.0  )
Pushpa-2 Movie:బన్నీ ఫ్యాన్స్‌కు ఎగిరి గంతేసే శుభవార్త.. భారీగా తగ్గిన పుష్ప-2 టికెట్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో 2021లో వచ్చిన పుష్ప(Pushpa) మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాలీవుడ్‌లో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం ‘పుష్ప 2’ థియేటర్లలో(theatres) పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. పుష్ప-2 టికెట్ల ధరల పై నిర్మాత రవిశంకర్ నిన్న(శనివారం) సినిమా సక్సెస్ మీట్ లో చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బన్నీ ఫ్యాన్స్‌కు ఎగిరిగంతేసే వార్త వచ్చింది.

అల్లు అర్జున్ పుష్ప-2 టికెట్ల ధరలు(Ticket prices) భారీగా తగ్గాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్(Multiplex), సింగిల్ స్క్రీన్(single screen) థియేటర్ల(theatres)లో రూ.100 నుంచి రూ.150 మేరా తగ్గాయి. రేపటి(సోమవారం) నుంచి తగ్గిన ధరలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బుకింగ్ సైట్లలో తగ్గించిన ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే సెకండ్ క్లాస్ రూ.80, ఫస్ట్ క్లాస్ రూ.140, బాల్కనీ రూ.200 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ధరలు కూడా బుకింగ్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఈ మేర టికెట్ ధరలు(Ticket prices) తగ్గడంతో అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed