- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vidudala-2 : రామారావుకే ఆ రైట్స్.. ఫ్యాన్సీ రేటుకు పంతం నెగ్గించుకున్న చింతపల్లి
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi)కి తెలుగులో కూడా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలు తెలుగులో కూడా మంచి హిట్‌ను అందుకుంటాయి. ఈ క్రమంలోనే లాస్ట్ ఇయర్ తమిళంలో సంచలన విజయం సొంతం చేసుకున్న ‘విడుదల’ (Vidudala)సినిమాకు తెలుగు ప్రేక్షకులు మంచి సక్సెస్‌ను ఇచ్చారు. ఇప్పుడు ఇదే క్రమంలో దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘విడుదల 2’ ను తెలుగు ఆడియన్స్‌కు అందించేందుకు ఎంతో మంది నిర్మాతలు పోటీ పడగా.. ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు (Producer Chintapalli Rama Rao)ఫ్యాన్సీ రేటుకు ఈ చిత్రాన్ని దక్కించుకున్కారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘ఏడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక డైరెక్టర్ వెట్రీ మారన్ (Vetri Maran), ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ఎస్ ఇన్ఫో టైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ‘విడుదల-2’ అత్యద్భుంగా తెరకెక్కించారు. అలాంటి ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విజయ్, సూరి నటన హైలైట్‌గా ఈ మూవీ ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ సినిమా మేము దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ మూవీకి వెట్రి మారన్ దర్శకత్వం వహించగా విజయ్ సేతుపతి, సూరిలతో పాటు మలయాళ నటి మంజుల వారియర్(Manjula Warrior), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), భవాని శ్రీ (bhavani sri) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.