Prakash Raj: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రకాష్ రాజ్ నగ్న ఫొటో.. ఆయన రియాక్షన్ ఇదే! (ట్వీట్)

by Hamsa |
Prakash Raj: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రకాష్ రాజ్ నగ్న ఫొటో.. ఆయన రియాక్షన్ ఇదే! (ట్వీట్)
X

దిశ, సినిమా: టెక్నాలజీ ఎంతలా అప్డేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్ది రోజుల నుంచి ఏఐ ద్వారా కొందరు పలు అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని బారిన పడటం వల్ల ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో రష్మిక ఫొటోలను కూడా ఏఐతో దారుణంగా ఎడిట్ చేసి కేటుగాళ్లు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన అప్పట్లో సెన్సేషనల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ప్రభుత్వానికి చెప్పడంతో వారు ఆమెకు అండగా నిలిచారు. ఆమెతో పాటు ఎంతో మంది సామాన్యులు కూడా ఏఐ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దీనిని ఉపయోగించి లేనివి ఉన్నట్లుగా చూపిస్తూ జనాలను మోసం చేస్తున్నారు.

గత కొద్ది రోజుల నుంచి ఏఐ ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా, ఏఐతో చేసిన టాలీవుడ్ స్టార్ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నాస్తికుడైన ఆయన కుంభమేళాకు వెళ్లి నదిలో స్నానం చేస్తున్నట్లుగా ఉంది. అందులో ఆయన దండం పెడుతూ నగ్నంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే దారుణంగా కామెంట్లు చేస్తూ.. ఆ పిక్‌ను షేర్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు xలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఫేక్ వార్తలను ప్రచారం చేస్తూ తమ పూజలను కూడా కలుషితం చేయడమే వీరి పని. వారిపై పోలీస్ కంప్లైంట్ దాఖలైంది. కోర్టు కిటికీలో ఏం చేస్తారో చూద్దాం’’ అని రాసుకొచ్చారు. అలాగే ఫొటోను కూడా షేర్ చేశారు. కాగా, ప్రకాష్ రాజ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలో నటించి మెప్పించారు. అలాగే హీరోయిన్లకు తండ్రిగా నటించి ప్రేక్షకులను ఫిదా చేశారు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే.. రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

Next Story

Most Viewed