Prabhas: కన్నప్ప నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్.. ప్రళయకాల రుద్రగా డార్లింగ్

by Kavitha |   ( Updated:2025-02-03 06:25:34.0  )
Prabhas: కన్నప్ప నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్.. ప్రళయకాల రుద్రగా డార్లింగ్
X

దిశ, సినిమా: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ పెంచుతున్నారు. ఇందులో భాగంగా గత సోమవారం ప్రభాస్ ఆఫ్ లుక్‌ను విడుదల చేసి నెక్స్ట్ సోమవారం ఫుల్ లుక్‌ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు ప్రభాస్ ఫుల్‌లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్.

ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ది మైటీ 'రుద్ర'.. డార్లింగ్- రెబల్ స్టార్ ప్రభాస్ కన్నప్పలో ‘రుద్ర’ పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో అతన్ని దైవిక బలం, జ్ఞానం కలిగిన రక్షకునిగా చూడబోతున్నారు. భక్తి, త్యాగం మరియు అచంచలమైన ప్రేమతో కూడిన అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ప్రభాస్.. ఈ ఏప్రిల్ 2025లో పెద్ద స్క్రీన్‌పై ఈ పురాణ గాథకు సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు’ అని రాసుకొచ్చింది.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. ప్రళయకాల రుద్రుడు!, త్రికాల మార్గదర్శకుడు!, శివాజ్ఞ పరిపాలకుడు! అని అతన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక ప్రభాస్.. చేతిలో కర్ర పట్టుకుని నుదిటిన విభూతి పెట్టుకుని, ఒంటినిండా రుద్రాక్షలను కట్టుకుని శివుడు పరమ భక్తుడి అవతారంలో దర్శనమిచ్చాడు. ఫైనల్‌గా డార్లింగ్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Next Story

Most Viewed