Prabhas: పవన్ కల్యాణ్ సినిమాలోని ఆ పాటంటే నాకు ప్రాణం.. ప్రభాస్ కామెంట్స్ వైరల్ (వీడియో)

by Gantepaka Srikanth |
Prabhas: పవన్ కల్యాణ్ సినిమాలోని ఆ పాటంటే నాకు ప్రాణం.. ప్రభాస్ కామెంట్స్ వైరల్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సలార్-2, రాజాసాబ్(The Raja Saab) చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంతరం హను రాఘవపూడి సినిమా.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోయే స్పిరిట్‌ను ప్రభాస్‌ లైన్లో పెట్టారు. మొత్తానికి సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల అయ్యేలా భారీగా ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్(Pawan Kalyan) జల్సా సినిమా(Jalsa Movie)లోని ‘చలోరే చలోరే చల్’ పాట గురించి తన మనసులోని మాటను ప్రభాస్ బయటపెట్టారు.

తన ఆల్‌టైమ్ ఫేవరేట్ సాంగ్ అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, పార్టీ మూడ్‌లో ఉన్నా ఆ పాటను చాలా ఎంజాయ్ చేస్తానని అన్నారు. ముఖ్యంగా ఆ పాటలోని లిరిక్స్‌కు బాగా కనెక్ట్ అయ్యానని వెల్లడించారు. గతంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా సినిమాలోని ఆ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రీ లిరిక్స్ రాశారు.


Advertisement

Next Story