Prabhas: ‘ఫౌజీ’ బరిలోకి దిగనున్న డార్లింగ్..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్..!

by Kavitha |
Prabhas: ‘ఫౌజీ’ బరిలోకి దిగనున్న డార్లింగ్..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్..!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అతను నటిస్తున్న చిత్రాల్లో ‘ఫౌజీ’(Fouji) ఒకటి. దీనికి దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక డార్లింగ్ సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వి(Imanvi) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే 1974 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో.. ప్రభాస్ డబుల్ యాంగిల్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘ఫౌజీ’ మూవీ వచ్చే వారం నుంచి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌(Hyderabad)లో జరగనున్న ఈ షూటింగ్‌లో మన డార్లింగ్ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story

Most Viewed