- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టార్ బాయ్ బర్త్ డే స్పెషల్‌గా ఆ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్.. ఇద్దరు భామలతో రొమాన్స్ మామూలుగా లేదుగా

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) ‘డీజే టిల్లు’(DJ Tillu) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో మరింత ఫేమ్ సంపాదించుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సిద్ధు ‘జాక్’(Jack), ‘తెలుసు కదా’(Telusu Kada) వంటి చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే నేడు స్టార్ బాయ్ పుట్టిన రోజు సందర్భంగా ‘తెలుసు కదా’ మూవీ నుంచి మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక పోస్టర్స్‌ను గమనించినట్లయితే.. ఫస్ట్ పోస్టర్‌లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinishi Shetty) హీరో ముక్కుకు ముక్కు తగిలించి రొమాంటిక్ మూడ్‌లో చూస్తుంటే.. హీరో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అలాగే సెకండ్ పోస్టర్‌లో.. హీరోయిన్ రాశి ఖన్నా(Rashi Khanna) స్టార్ బాయ్ సిద్ధు నుదిటిపై కిస్ చేస్తుండగా హీరో ఆమె చేతులను హోల్డ్ చేసి ఉన్నాడు.
కాగా సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన(Neeraja kona) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా మూవీ ‘తెలుసు కదా’. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టితో పాటు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దీనికి తమన్(Thaman) సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మించనుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు సమాచారం.