NTR: ‘దేవర’ చుట్టమల్లె సాంగ్ పాడిన పాప్ సింగర్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)

by Hamsa |
NTR: ‘దేవర’ చుట్టమల్లె సాంగ్ పాడిన పాప్ సింగర్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘దేవర’(Devara: Part 1) లోని ప్రతి పాట ఆకట్టుకోగా.. ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. రెండవ పార్ట్ త్వరలో రాబోతుంది.. ఇక రిలీజ్ అయిన మొదటి పార్ట్ ఊహించని రేంజ్‌లో హిట్ సాధించింది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) పాడిన ‘చుట్టమల్లె సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. దేవర చుట్టమల్లే సాంగ్‌ను ఓ పాప్ సింగర్ ఈవెంట్‌లో పాడి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాపులర్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ (Ed Sheeran) తన కాన్సర్ట్‌లో ఎన్టీఆర్ పాటను పాడిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

బెంగుళూరులో ప్రదర్శన ఇచ్చిన షీరన్.. ఈవెంట్‌లో ‘చుట్టమల్లే’ పాట పాడి జోష్ నింపారు. బ్రిటిష్ సింగర్ నోట తెలుగు పాట రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. స్పందించారు. ‘‘సంగీతానికి హద్దులుండవు. మీరు ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. మీ గొంతులో చుట్టమల్లే సాంగ్ వినడం నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం’’ అని రాసుకొచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా షీరన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed