బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాలో పవన్ కళ్యాణ్.. అనిల్ రావిపూడి ప్లాన్ అదిరిందిగా..?

by Hamsa |   ( Updated:2023-10-07 05:35:45.0  )
బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాలో పవన్ కళ్యాణ్.. అనిల్ రావిపూడి ప్లాన్ అదిరిందిగా..?
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ డబుల్ యాక్షన్‌లో రాబోతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. దీనిని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కాజల్, శ్రీ లీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ‘భగవంత్ కేసరి’లో పవన్ కళ్యాణ్ కూడా కనిపించబోతున్నాడట. పవన్ సినిమాలోని ఒక రెండు పవర్ ఫుల్ డైలాగ్స్‌ను బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో పెట్టాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారట. అంతేకాకుండా తన బాడీ మోడిలేషన్ పరంగా చెప్తే సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుందని అనుకుంటున్నాడట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ వార్త మాత్రం వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు చంద్రబాబు జైలుకు పోవడంతో బాలయ్య, పవన్ కలిసిన సిచువేషన్‌ని అనిల్ రావిపూడి బాగా యూస్ చేసుకుంటున్నాడని అభిప్రాయపడుతున్నారు. కాగా భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Advertisement

Next Story