Radhika Apte : బాలయ్య హీరోయిన్ చేసిన పనికి ఛీ కొడుతున్న నెటిజన్స్

by M.Rajitha |
Radhika Apte : బాలయ్య హీరోయిన్ చేసిన పనికి ఛీ కొడుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ వివాదాస్పద నటి రాధిక ఆప్టే(Radhika Apte) గురించి తెలియని వారుండరు. తన స్టేట్మెంట్స్ తో గాని, చిత్రాలతో గాని, ఫోటో ఘాట్స్ తోగాని ఎప్పుడూ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా ఉంటుంది. పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా పలు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా గత డిసెంబరులో ఓ బిడ్డను కన్న తర్వాత మొదటిసారిగా బ్రిటిష్ అకాడమీ ఫిల్మీ అవార్డు(British Academy Filmy Awards)లో మెరిసింది రాధిక. అయితే అక్కడ ఓ చేతిలో బ్రెస్ట్ మిల్క్ పంపింగ్, మరో చేతిలో వైన్ గ్లాసు పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్(Instagram) లో పోస్ట్ చేయగా.. నెటిజన్స్ అమ్మడు మీద ఫైర్ అవుతున్నారు. రెండు నెలల బిడ్డకు పాలిస్తూ.. మద్యం తాగడం ఏంటని మండిపడుతున్నారు.

చిన్నారి ఆరోగ్యానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని కొంతమంది అంటుంటే.. ఛీ ఇదేం పాడు పని రాధిక అక్క అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. 'రక్తచరిత్ర' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ భామ.. బాలయ్య బాబు 'లెజెండ్' సినిమాతో పాపులర్ అయ్యింది. తర్వాత వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యింది. ఈ ఏడాది 'మెర్రీ క్రిస్మస్', 'సిస్టర్స్ మిడ్ నైట్' సినిమాలు విడుదల కాగా.. 'లాస్ట్ డేస్' అనే హాలీవుడ్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. 2012లో బ్రిటిష్ కంపోజర్ బెనెడిక్ట్ టేలర్ ను ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది.

Next Story