Lavanya Tripathiది ఐరన్ లెగ్.. మెగా ఫ్యామిలీకి అందుకే అలా జరుగుతుందంటూ Varun Tejకు నెటిజన్ల సలహా

by Hamsa |   ( Updated:2023-08-31 08:24:17.0  )
Lavanya Tripathiది ఐరన్ లెగ్.. మెగా ఫ్యామిలీకి అందుకే అలా జరుగుతుందంటూ Varun Tejకు నెటిజన్ల సలహా
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ఫ్యామిలీ గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారుతూనే ఉంటుంది. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవ ధారి అర్జున’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో కొంత మంది లావణ్య త్రిపాఠి వల్లే అలా జరిగిందన్న ప్రచారం చేస్తున్నారు. ఇటీవల లావణ్య, త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే ఆమెది ఐరన్ లెగ్ అని అందుకే మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని కొంత మంది నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే వరుణ్ తేజ్ గాండీవ ధార అర్జున అతని కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన బ్రో చిత్రం కూడా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది కావాలనే ట్రోలర్స్ మీ ఇంట్లోకి లావణ్య త్రిపాఠి అడుగు పెట్టడం వల్లే మీకు ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయని, ఆమె ఇండస్ట్రీకి రావడమే ఓ ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకొని వచ్చింది. అలాంటిది ఆమె ఇప్పుడు మీ కుటుంబంలోకి రాబోతుంది. మీ కుటుంబంలో ఇంకా ఎన్ని చెడు సంఘటనలు జరగబోతాయో.. దయచేసి ఇప్పటికైనా లావణ్య తో మీ పెళ్లిని ఆపేయండి అంటూ కొంతమంది కావాలనే ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ట్రోలర్స్‌పై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : నేనేం అలాంటి పని చేయనంటూ గుడ్ న్యూస్ చెప్పిన శ్రీ లీల

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed