Nayanthara: కర్మ వదిలిపెట్టదంటూ నయనతార సంచలన పోస్ట్.. ధనుష్‌ను ఉద్దేశించేనా?

by Hamsa |
Nayanthara: కర్మ వదిలిపెట్టదంటూ నయనతార సంచలన పోస్ట్.. ధనుష్‌ను ఉద్దేశించేనా?
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’(Beyond the Fairy Tale) డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో నయన్ తన మొదటి సినిమా ‘నానుమ్ రౌడీ దాన్’(Naanum Rowdy Dhaan) కు సంబంధించిన సీన్స్‌ను యాడ్ చేసింది. ప్రజెంట్ ఈ డాక్యుమెంటరీ(Documentary) ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వివాదానికి కారణం అయింది. తన అంగీకారం లేకుండా నయన్ సీన్స్ యాడ్ చేయించుకుందని నెట్‌ఫ్లిక్స్, నయన్‌, ధనుష్(Dhanush) మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ వివాదం కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

అయితే ధనుష్ నోటీసులు కూడా పంపించాడు. యాడ్ చేసిన సీన్స్‌ను తొలగించకపోతే రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ధనుష్‌పై విరుచుకు పడుతూ నయన్ మూడు పేజీల ప్రకటన విడుదల చేసింది. దీంతో వెంటనే ధనుష్ చెన్నై(Chennai) హైకోర్ట్‌లో కేసు వేశారు. తన అంగీకారం లేకుండా సీన్స్ యాడ్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా తనకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో.. తాజాగా, నయనతార ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది. ‘‘మీరు అబద్ధం చెప్పి ఒకరి జీవితాన్ని నాశనం చేసినప్పుడు, దానిని అప్పుగా తీసుకోబడుతుంది. అది మీకు వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది. కర్మ వదిలిపెట్టదు’’ అనే కర్మ సిద్ధాంతాన్ని షేర్ చేసింది. ప్రజెంట్ నయన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ధనుష్‌ను ఉద్దేశించే పెట్టిందని అంటున్నారు. ఇండైరెక్ట్‌గా సెటైర్ వేసిందని చర్చించుకుంటున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed