Udaya Bhanu: యాంకర్ కూతుళ్లకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. ఏం పంపిందంటే? (వీడియో)

by Hamsa |
Udaya Bhanu: యాంకర్ కూతుళ్లకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. ఏం పంపిందంటే? (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్ ఉదయభాను(Udaya Bhanu) అందరికీ సుపరిచితమే. అప్పట్లో వరుస షోలకు హోస్ట్‌గా వ్యవహరించి తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. వన్స్ మోర్ ప్లీజ్(Once more please), రేలా రేలా, ఢీ, సాహసం చేయరా డింభకా, నువ్వు వంటి షోలతో మెప్పించిన ఆమె పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అప్పటి నుంచి నటనకు దూరంగా ఉంటుంది. ఓ యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి ఇందులో పలు విషయాలను తెలుపుతోంది. ఇక ఇటీవల ఆమె మళ్లీ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది.

అలాగే సినిమాల్లోనూ నటిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఉదయ భాను తన పిల్లలకు బాలయ్య(Balakrishna) కూతురు నారా బ్రాహ్మణి(Nara Brahmani) ఓ స్పెషల్ గిఫ్ట్ పంపినట్లు తెలుపుతూ ఓ వీడియోను ఫేర్ చేసింది. అయితే ఇందులో బహుమతిని పట్టుకుని తన కవల వద్దకు వెళ్లి..బాలయ్య మామ అంటే ఎవరికి ఇష్టం అని అడగ్గా.. ఇద్దరు చేతులెత్తడంతో మీకో గిఫ్ట్ పంపించారు అని చెప్తుంది. ఆ తర్వాత వయోలిన్ పంపించింది. మాత్రం ఆయన కూతురు నారా బ్రాహ్మణి అని చెప్తుంది. దీంతో వారు చాలా సర్‌ప్రైజ్ అవుతారు. ఆ తర్వాత బాలయ్యకు, బ్రాహ్మణికి థాంక్స్ చెబుతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వావ్ గ్రేట్ అని బ్రాహ్మణిని పొగుడుతున్నారు.

Next Story