Nani's 'Court': ‘కోర్ట్’ సీక్వెల్‌పై హింట్ ఇచ్చిన నాని.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే మతిపోవాల్సిందే?

by sudharani |   ( Updated:2025-03-16 14:31:51.0  )
Nanis Court: ‘కోర్ట్’ సీక్వెల్‌పై హింట్ ఇచ్చిన నాని.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే మతిపోవాల్సిందే?
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’ (Court). ప్రియదర్శి (Priyadarshi)ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో.. శివాజీ (Shivaji), సాయి కుమార్ (Sai Kumar), రోహిణి (Rohini), హర్ష వర్థన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్ర పోషించారు. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ చిత్రం ఈనెల 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయి ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ (Positive talk) సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అలాగే.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్రజెంట్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా సక్సెస్ మీట్‌(Success Meet)లో మాట్లాడిన నాని కోర్ట్ సీక్వెల్‌(Court sequel)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఇది లవ్ స్టోరీ (love story) యాంగిల్‌లో లేదు అని అన్నారు. ఒకవేళ కావాలంటే సీక్వెల్‌లో లవ్ యాంగిల్ సింక్ చేసుకో’ అని నాని అనగా.. వెనుక నుంచి ప్రియదర్శి సీక్వెల్ ఉందా అన్నా అని ప్రశ్నిస్తాడు. ‘ఏమో చెప్పలేం.. ఇప్పుడు కోర్ట్ సినిమా బయట కుమ్మేస్తుంది. ఈ ఫ్లోనుబట్టి చూస్తే.. సీక్వెల్ తీశామంటే పాన్ ఇండియానే అయిపోద్ది అనుకుంటా. ఇప్పుడు చిన్న సినిమా అంటున్నారు కదా.. కానీ ఇప్పుడు వచ్చిన ట్రెండ్ బట్టి తీసుకుంటే.. సీక్వెల్ అని అనౌన్స్ చేశామంటే ‘కోర్ట్’ చాలా పెద్ద సినిమా అయిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ కావడంతో.. ఇలాంటి సినిమాలు సీక్వెల్ రావాలి తప్పకుండా ట్రై చెయ్యండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed