Naga Chaitanya - Indian Racing Festival: హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న నాగ చైతన్య‌

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-22 11:51:43.0  )
Naga Chaitanya - Indian Racing Festival: హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న  నాగ చైతన్య‌
X

దిశ, సినిమా : నాగ‌చైత‌న్య‌ సరికొత్త ప్ర‌యాణానికి శ్రీకారం చుట్టాడు. కారు రేసింగ్స్, ఫార్ములా వన్ అంటే ఇష్టమున్న చై.. ఇప్పుడు అదే రంగంలోకి అడుగుపెట్టాడు. ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ లో పోటీ ప‌డే హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. ఐఆర్ఎఫ్‌ నిర్వ‌హించే ఫార్ములా 4లో భాగ‌మ‌య్యాడు. కాగా ఇందుకు సంబంధించిన రేసు ఈవెంట్స్ ఆగ‌స్ట్ 24 నుంచి స్టార్ట్ అవుతున్నాయి

ఈ సంద‌ర్బంగా మాట్లాడిన అక్కినేని నాగ‌చైత‌న్య ‘‘నాకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్మాలా వ‌న్‌ అంటే ప్రేమ. ఇందులోని హై స్పీడ్ డ్రామా, థ్రిల్ ఎట్రాక్ట్ చేస్తుంది. ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ నాకు కాంపిటేష‌న్ కంటే ఎక్కువ . నా పాషన్ కలగలిపిన చ‌క్క‌టి వేదిక. హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్‌ను సొంతం చేసుకోవ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఐఆర్ఎఫ్ మ‌ర‌చిపోలేని అనుభూతినిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. అలాగే దీంతో ఇండియ‌న్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. న్యూ టాలెంట్ బ‌యట‌కు వ‌స్తుంది’’ అని అన్నారు. కాగా ఇందులో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ క‌పూర్‌, జాన్ అబ్ర‌హం, మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ గంగూలీ కూడా భాగమయ్యారు.

Advertisement

Next Story