Naga Chaitanya: విడాకులపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు.. దానికి కారణం ఆమె కాదంటూ..

by Kavitha |
Naga Chaitanya: విడాకులపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు.. దానికి కారణం ఆమె కాదంటూ..
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన స్టార్ హీరోయిన్ సమంత(Samantha)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ పట్టుమని ఫోర్ ఇయర్స్ కలిసి ఉండలేక విడాకులు(Divorce) తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి సమంత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడి సినిమాలకు దూరం అయింది. అంతే కాకుండా ప్రజెంట్ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది.

కానీ నాగ చైతన్య డివోర్స్ తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Sobhitha Dhulipala)తో డేటింగ్‌లో ఉంటూ 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య- శోభితలు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పుడు వీరిపై భారీగా నెగెటివిటీ వచ్చిందన్న సంగతి తెలిసిందే. అందులో మరీ ముఖ్యంగా శోభితను అయితే సామ్ ఫ్యాన్స్ గట్టిగానే తిట్టుకున్నారు. అసలు సమంత నాగ చైతన్య విడిపోవడానికి శోభితనే కారణం, ఆమె వల్లనే సామ్‌కు విడాకులు ఇచ్చాడంటూ శోభితను సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్స్ కూడా చేశారు.

అయితే తాజాగా ఈ ప్రచారంపై అక్కినేని నాగ చైతన్య స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను సమంతతో విడాకులు తీసుకోవడానికి కారణం శోభిత అనే ప్రచారం విని చాలా బాధపడ్డాను. అసలు ఆమెకు ఈ చెడ్డ పేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణం కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్‌స్టా చాట్‌లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది.

మా మధ్య తొలుత స్నేహం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది రిలేషన్‌షిప్‌లా మారింది అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా చైతన్య తాజాగా ‘తండేల్’(Thandel) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అలాగే కలెక్షన్ల విషయంలోనూ మంచి వసూళ్లను రాబడుతోంది.

Next Story

Most Viewed